పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: వేర్వేరు సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

Title: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: వేర్వేరు సమయాల్లో లోక్‌సభ, రాజ్యసభ, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

Description:

పార్లమెంటు బడ్జెట్-2022 సమావేశాలు జనవరి 31, సోమవారం నాడు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండు విడతలుగా జరగనుంది. మొదటి విడతలో జనవరి 31 నుండి ఫిబ్రవరి 11 వరకు మరియు రెండో విడతలో మార్చి 14 నుండి ఏప్రిల్ 8 వరకు జరగనుంది. ముందుగా జనవరి 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంట్ షిఫ్ట్‌ల వారీగా...

Date of Published: 2022-01-25

Suggested Content