తెలంగాణలో కొత్తగా 4416 మందికి కరోనా పాజిటివ్, 2 మరణాలు నమోదు

Title: తెలంగాణలో కొత్తగా 4416 మందికి కరోనా పాజిటివ్, 2 మరణాలు నమోదు

Description:

తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4416 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 21, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,26,819 కి చేరింది. కరోనా వలన మరో ఇద్దరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,069కి పెరిగింది. అలాగే మరో 1,920 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,93,623కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1670, మేడ్చల్ మల్కాజిగిరిలో 417, రంగారెడ్డిలో 301 నమోదయ్యాయి...

Date of Published: 2022-01-22

Suggested Content