సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, జనవరి 21 నుండి 24 వరకు 55 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

Title: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, జనవరి 21 నుండి 24 వరకు 55 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

Description:

దేశంలో పలు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా జనవరి 21 నుండి జనవరి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఎక్కువుగా ఉన్నాయి. (1/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @d...

Date of Published: 2022-01-22

Suggested Content