ఏపీలో కరోనా తీవ్రత : కొత్తగా 13819 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు

Title: ఏపీలో కరోనా తీవ్రత : కొత్తగా 13819 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కొత్తగా 13,819 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 25, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,08,955 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1988, ప్రకాశంలో 1589, గుంటూరులో 1422, అనంతపూర్ లో 1345, నెల్లూరులో 1305, కర్నూల్ లో 1255, కడపలో 1083, తూర్పుగోదావరిలో 1001 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 5716 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు...

Date of Published: 2022-01-25

Suggested Content